ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_)

ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-28T02:53:14.000Z

🏆 8 సార్లు ఓడినా వదల్లేదు.. 40 ఏళ్ల పోరాటం తర్వాత సర్పంచ్ పీఠం! 📝 కడప జిల్లా రాజంపేట మండలం తొగురుపేట పంచాయతీ పరిధిలోని చింతలకోనకు చెందిన కుటలగారి వెంకటయ్య ఎట్టకేలకు సర్పంచ్‌గా గెలిచారు. 📝 సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేయాలనే పట్టుదలతో 40 ఏళ్లుగా పోటీ చేస్తూ, ఎనిమిదిసార్లు ఓడిపోయినా నిరాశ చెందకుండా తొమ్మిదోసారి బరిలో దిగారు. 📝 ఈసారి గ్రామస్థులు ఓట్లతో ఆశీర్వదించి, ఆయన నలభై ఏళ్ల కలను నిజం చేశారు. #Rajampet #Kadapa

1 1 55 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T21:23:26.000Z

లోక్‌సభ సీట్ల పెంపు జరిగితే....రాష్ట్రాల వారీగా మారనున్న గణాంకాలు... డీలిమిటేషన్ ప్రతిపాదనపై ముచ్చట్లు విశ్లేషణ.... రాష్ట్రాల వారీగా లోక్‌సభ సీట్ల అంచనా! #Delimitation #LokSabha #IndiaPolitics #PoliticalAnalysis #SouthIndia #SeatDistribution https://t.co/ya5MBnqFK5

3 1 267 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T19:56:29.000Z

డీలిమిటేషన్ బిల్లును ఉపసంహరించుకోనున్న కేంద్రం.. మహిళా రిజర్వేషన్లకు కొత్త బిల్లు 2026 డీలిమిటేషన్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లును ఉపసంహరించుకునేందుకు ప్రతిపాదన సిద్ధం చేసింది. ఏప్రిల్ 16, 2026న డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 13న జరిగిన ఓటింగ్‌లో రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన ప్రత్యేక మెజారిటీ రాకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగలేదు. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల కేటాయింపుల్లో తేడాలు వస్తాయనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. జనాభా పెరుగుదల ఆధారంగా రాష్ట్రాల ప్రాతినిధ్యం మారే అవకాశం ఉండటంపై చర్చ జరిగింది. మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో రిజర్వేషన్లు వెంటనే అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యపై 50 శాతం అదనపు సీట్లు పెంచే అవకాశం ఉంది. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీల సీట్లు కూడా పెరగనున్నాయి. సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తి అలాగే కొనసాగించాలని ప్రతిపాదించారు. దీంతో రాష్ట్రాల ప్రాతినిధ్యంలో సమతుల్యత దెబ్బతినకుండా చూడాలని కేంద్రం భావిస్తోంది. కొత్త డీలిమిటేషన్ బిల్లు ప్రకారం నియోజకవర్గాల విభజన తాజా జనాభా లెక్కల ఆధారంగా చేపట్టనున్నారు. మహిళలకు కేటాయించే సీట్లను రొటేషన్ పద్ధతిలో నిర్ణయించే బాధ్యత డీలిమిటేషన్ కమిషన్‌కు ఇవ్వనున్నారు. పాత డీలిమిటేషన్ బిల్లులోని నిబంధనలను మార్చి, మహిళా రిజర్వేషన్లకు తక్షణ అమలు కల్పించేలా కొత్త బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పాత బిల్లును ఉపసంహరించుకోవాలని లోక్‌సభ నిబంధనల ప్రకారం ప్రతిపాదించింది. #DelimitationBill #WomenReservation #Parliament #IndianPolitics

2 0 277 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T19:52:27.000Z

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గదు : చంద్రబాబు 🔹 లోక్‌సభ సీట్లను 50% పెంచినా దక్షిణ భారత రాష్ట్రాల ప్రాతినిధ్య వాటా 23.76% వద్దే కొనసాగుతుంది అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 🔹 దక్షిణాది రాష్ట్రాల మొత్తం లోక్‌సభ సీట్లు 129 నుంచి 195కు పెరుగుతాయని వెల్లడించారు. 🔹 ఆంధ్రప్రదేశ్ : 25 → 38 సీట్లు | 4.60% వాటా 🔹 తమిళనాడు : 39 → 59 సీట్లు | 7.18% వాటా 🔹 కర్ణాటక : 28 → 42 సీట్లు | 5.16% వాటా 🔹 తెలంగాణ : 17 → 26 సీట్లు | 3.13% వాటా 🔹 కేరళ : 20 → 30 సీట్లు | 3.68% వాటా 🔹 దక్షిణాది రాష్ట్రాల సీట్లు 66 పెరిగినా, దేశంలోని మొత్తం లోక్‌సభ సీట్లలో దక్షిణాది వాటా 23.76%గానే కొనసాగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 🔹 డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలని సవాల్ చేశారు. దేశంలో కీలక ప్రజా విధానాలు పార్టీల ఏకాభిప్రాయంతోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. #ChandrababuNaidu #Delimitation #SouthIndia #LokSabha

1 0 248 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T19:24:26.000Z

మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : చంద్రబాబు మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై అన్ని రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తీసుకోవాలని ఢిల్లీలో సీఎం @ncbn పిలుపునిచ్చారు. గతంలో పార్లమెంట్‌లో అంతరాయాల కారణంగా మహిళా రిజర్వేషన్ ప్రయత్నాలు నిలిచిపోయిన విషయాన్ని గుర్తుచేస్తూ, గత తప్పిదాలు మళ్లీ జరగకూడదని పార్టీలకు సూచించారు. మహిళా రిజర్వేషన్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్ అని, మహిళలు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారని ఈ అంశానికి అందరూ మద్దతుగా నిలవాలని చంద్రబాబు అన్నారు. #ChandrababuNaidu #WomenReservation #Delimitation #NewDelhi

1 0 212 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T16:37:51.000Z

💔 అపెండిక్స్ ఆపరేషన్ తర్వాత మహిళ మృతి.. డాక్టర్ల నిర్లక్ష్యమంటూ ఆందోళన 📌 పెద్దపల్లి జిల్లా కాపులపల్లికి చెందిన అజయ్ భార్య శ్రీలత అపెండిక్స్ సమస్యతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, శుక్రవారం వైద్యులు ఆపరేషన్ చేశారు. 📌 ఆపరేషన్ తర్వాత ఆమె చనిపోయిందని, డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 📌 ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. #Peddapalli #Kapulapalli

4 0 392 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T16:09:41.000Z

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 51 రసగుల్లాలు లాగించేశాడు 😱 బిహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంట్లో కార్యక్రమానికి వచ్చిన ఓ వ్యక్తి 51 రసగుల్లాలు తింటున్న వీడియో వైరల్ అవుతుండగా, తిన్నాక అతడి హావభావాలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. #AnantSingh #Bihar https://t.co/JVE5KLflBu

0 0 423 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T15:58:50.000Z

2029 నాటికి డ్రగ్స్ లేని భారత్.. ఇదే మోదీ సంకల్పం: కిషన్ రెడ్డి 🔹 హైదరాబాద్‌లో మూడు రోజులు సాగిన 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(@kishanreddybjp) మాట్లాడారు. 🔹 డ్రగ్స్ నిర్మూలనను రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి చూడాల్సిన సామాజిక అంశమని స్పష్టం చేశారు. #TelanganaBJP #KishanReddy

1 0 258 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T15:29:22.000Z

గుజరాత్‌లో దీపావళి వేడుకలపై వివాదం.. దళిత యువకులపై దాడి ఆరోపణలు 🔹 నవంబర్ 8న దీపావళి రాత్రి గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, పాలన్‌పూర్ తాలూకా భగల్ గ్రామంలో బస్‌స్టాండ్, లైబ్రరీ దగ్గర బహిరంగ ప్రదేశంలో దళిత యువకులు టపాసులు కాలుస్తున్నారు. 🔹 పక్కనే ఉన్న కొందరు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. బహిరంగ ప్రదేశంలో దీపావళి జరుపుకునే హక్కు తమకూ ఉందని యువకులు చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 🔹 ఆ తర్వాత "కులం, మతం" పేరుతో దూషించి.. కాలర్ పట్టుకుని, పిడిగుద్దులు, తన్నులతో దాడి చేశారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని పాలన్‌పూర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. 🔹 భవేష్‌భాయ్ రామభాయ్ ఫిర్యాదుతో పాలన్‌పూర్ తాలూకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కొందరు నిందితులను అరెస్ట్ చేశారు. వీడియో 1 : మొదటి జరిగిన గొడవ వీడియో 2: ఈ రోజు జరిగిన ముచ్చట #Gujarat #BhagalVillage #DalitRights #DiwaliIncident

4 0 593 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T15:16:36.000Z

వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌కు ఐబీఎం బ్రేక్... ఉద్యోగులకు దేశం విడిచిపెట్టాలని ఆదేశాలు 🔹 అమెరికాలోని ఐబీఎం (IBM) సంస్థ కన్సల్టింగ్ విభాగంలో చాలా ఉద్యోగులకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ నిలిపివేసినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో పలువురు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో పడే పరిస్థితి. 🔹 ప్రభావిత ఉద్యోగులకు మూడు వారాల గడువు ఇచ్చి, విదేశాల్లోని ఇతర కార్యాలయాలకు బదిలీ కావాలా లేదా ఉద్యోగం వదులుకోవాలా తేల్చుకోవాలని సూచించినట్లు సమాచారం. డిసెంబర్ 31లోగా వెళ్లిపోతే మూడు నెలల సెవెరెన్స్ (పరిహారం) అందించనున్నట్లు తెలుస్తోంది. 🔹 భారత్‌కు తిరిగి వస్తే వేతనాల్లో భారీ కోత పడే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉద్యోగి భారత్‌కు బదిలీ అయితే తన జీతం 80% తగ్గుతుందని చెప్పినప్పటికీ, ఇది సంస్థ సాధారణ విధానమని ఐబీఎం ధృవీకరించలేదు. 🔹 మారుతున్న నైపుణ్యాల అవసరాలు, క్లయింట్ల డిమాండ్లే ఈ నిర్ణయానికి కారణమని సంస్థ చెబుతోంది. ఈ నిర్ణయం వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. #IBM #USVisa #GreenCard #TechJobs

2 0 251 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T15:10:21.000Z

🔫 పోలీసులపైనే కాల్పులు జరిపి పరార్.. తెల్లవారుజామున చుట్టుముట్టి పట్టుకున్నారు! ▪️ పశ్చిమ బెంగాల్ అసన్‌సోల్‌లోని హీరాపూర్‌లో బుధవారం తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపి ప్రతాప్ దాస్ అలియాస్ 'ప్యాన్' తప్పించుకున్నాడు. ▪️ శుక్రవారం తెల్లవారుజామున భారీ బలగాలతో వెళ్లిన పోలీసులు, జనం ఎక్కువగా ఉండే ఇస్మాయిల్ రోడ్ ప్రాంతంలో ఇళ్లు గాలిస్తూ, ప్రహరీ గోడలు ఎక్కి అతడిని చుట్టుముట్టారు. ▪️ అక్కడ కూడా అతడు పోలీసులపై కాల్పులు జరపడంతో, ఎదురుకాల్పుల్లో కాలికి గాయమైంది, ఆ తర్వాత అరెస్ట్ చేశారు. #Asansol #WestBengal

1 0 329 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T14:26:12.000Z

❤️ పాత్ర ముగిసినా బంధం మిగిలింది.. ఏటా 26/11న మేజర్ సందీప్ తల్లిదండ్రుల వెంట అడివి శేష్ 📝 "మేజర్" సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించిన అడివి శేష్(@AdiviSesh), ప్రతి ఏటా 26/11 రోజున ఆయన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వారికి తోడుగా ఉంటున్నారు. 📝 ఒక్క సినిమాతో ఆ కుటుంబంలో భాగమైపోయారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. #AdiviSesh #SandeepUnnikrishnan

2 1 361 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T14:23:57.000Z

⚠️ కబ్జా కట్టడాన్ని కూల్చుతుంటే.. మున్సిపల్ సిబ్బందిపై చేయి చేసుకున్నాడు! 🔹 ఆదిలాబాద్‌ సర్వే నంబర్ 170 కాలనీలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో అక్రమంగా ఉంటున్నవాళ్లను మున్సిపల్ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. 🔹 ఈ క్రమంలో అక్కడ ఉంటున్న మధుకర్ ప్రభుత్వ స్థలం ఆక్రమించి కట్టిన నిర్మాణాన్ని గుర్తించి తొలగించడం మొదలుపెట్టారు. 🔹 దీంతో కోపంతో ఊగిపోయిన మధుకర్ సిబ్బందిపై దాడికి దిగాడు. #Adilabad #Municipal

2 1 298 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T14:08:33.000Z

ప్రైవేట్‌లో రూ.12 లక్షల ఆపరేషన్...గాంధీలో ఫ్రీగా చేసి వినికిడి ఇచ్చారు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన ఎనిమిదేళ్ల విహాన్ సాయి పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నాడు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడికి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా చేశారు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో దీనికి రూ.10-12 లక్షలు ఖర్చవుతుంది. వైద్య బృందాన్ని సూపరింటెండెంట్ డా. ఉషారాణి అభినందించారు, పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని వాడుకోవాలని సూచించారు. #GandhiHospital #Banswada

0 0 232 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T13:52:51.000Z

ఇంటి ముందు బస్టాండ్ కట్టలేని వ్యక్తి ఈటల ఓ 'గజనీ' : పాడి కౌశిక్ రెడ్డి 20 ఏళ్లు ఆదరించిన హుజూరాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ ఒక్క ఓటమితోనే వదిలేసి వెళ్లిపోయారని ఎమ్మెల్యే @KaushikReddyBRS విమర్శించారు. గెలిచినా ఓడినా తాను నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని చెప్పారు. సొంతూళ్లో ఇంటి ముందు బస్టాండ్ కట్టుకోలేని ఈటల అభివృద్ధి చేశానంటే ప్రజలు నమ్మరని, నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయో కూడా గుర్తులేని 'గజనీ'లా మారారని ఎద్దేవా చేశారు. #BRS #EtelaRajender

1 0 287 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T13:38:18.000Z

పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు నవంబర్ 29న జరిగే PRBT–2026 పరీక్ష నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పోలీసు, సైనిక సిబ్బంది, హోంగార్డులు, ఫ్లయింగ్ స్క్వాడ్, విద్యాశాఖ సిబ్బంది, అంత్యక్రియల ఊరేగింపులకు మినహాయింపు ఉంటుంది. #CyberabadPolice #PRBT2026 #ExamAlert #TelanganaNews @cyberabadpolice

0 0 284 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T13:14:45.000Z

పూజలతో కుమార్తెను రప్పిస్తామంటూ నమ్మించి 50 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు కుమార్తె తిరిగి వచ్చేలా ప్రత్యేక పూజలు చేస్తామంటూ ఓ కుటుంబాన్ని నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసిన ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సమస్యలను ఆసరాగా చేసుకుని బాధితులను నమ్మించారు. తాంత్రిక పూజలతో కుమార్తె మనసు మార్చుకుని తిరిగి వస్తుందని నమ్మబలికారు. లేదంటే ఆమెను పెళ్లి చేసుకున్న వ్యక్తిని అంతమొందిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. విడతలవారీగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. కీసర కాళీమాత ఆలయంలో పూజలు నిర్వహించే క్రాంతి కుమార్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కీసర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. #Keesara #Fraud #CrimeNews #TelanganaPolice

1 0 473 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T13:11:03.000Z

15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ అధికారులు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు ఇద్దరు ఉద్యోగులను లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ ఏ. రాజేష్ కుమార్, వర్క్ ఇన్‌స్పెక్టర్ (ఔట్‌సోర్సింగ్) ఏ. శివారెడ్డి అరెస్ట్ అయ్యారు. 2025 గణేష్ నిమజ్జనం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఉబా చెరువులో చేపట్టిన డీసిల్టింగ్ పనులకు సంబంధించి రూ.4.50 లక్షల కాంట్రాక్ట్ బిల్లు ఇప్పటికే మంజూరు చేసి ప్రాసెస్ చేసినందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి నుంచి తీసుకున్న రూ.15 వేల లంచాన్ని రాజేష్ కుమార్, శివారెడ్డికి భద్రపరిచేందుకు అప్పగించగా ఏసీబీ అధికారులు ఆ మొత్తాన్ని శివారెడ్డి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అధికారులు విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. #ACB #Sangareddy #Bribery #TelanganaNews

3 0 226 0 0
ముచ్చట్లు | Stories • Voices • Views @muchatlu_ 2026-11-27T13:07:23.000Z

ప్రసవ సమయంలో మహిళ మృతి.. డాక్టర్‌పై హత్య కేసు...మనస్తాపంతో వైద్యురాలి ఆత్మహత్య రాజస్థాన్‌లోని దౌసా జిల్లా లాల్సోట్‌లో ప్రసవ సమయంలో 22 ఏళ్ల ఆశా అనే మహిళ మృతి చెందింది. తీవ్రమైన ప్రసవానంతర రక్తస్రావం (Postpartum Haemorrhage) కారణంగా ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఘటన జరిగిన రోజే సుమారు 200 మంది ఆసుపత్రి వద్ద గుమిగూడి ఆందోళన చేపట్టారు. స్థానిక నాయకులు కూడా రంగంలోకి దిగడంతో, డాక్టర్ అర్చనా శర్మ, ఆమె భర్త డాక్టర్ సునీత్ ఉపాధ్యాయ్‌పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. స్వతంత్ర వైద్య అభిప్రాయం లేకుండానే క్రిమినల్ కేసు నమోదు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 40 ఏళ్ల డాక్టర్ అర్చనా శర్మ ప్రసూతి వైద్య నిపుణురాలు, గోల్డ్ మెడలిస్ట్. 2016లో భర్తతో కలిసి లాల్సోట్‌లో 45 పడకల ఆనంద్ ఆసుపత్రిని ప్రారంభించారు. రోగి మరణం, హత్య కేసు నమోదు నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో "నేను ఎలాంటి తప్పు చేయలేదు.. ఎవరినీ చంపలేదు" అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ అర్చనా మరణంతో రాజస్థాన్ వ్యాప్తంగా వైద్యులు నిరసనకు దిగారు. వైద్య సేవలను నిలిపివేశారు. అనంతరం దంపతులపై నమోదైన హత్య కేసును తొలగించారు. మృతురాలి భర్త లాలూరామ్ బైరవా.. తనకు చదవడం కూడా సరిగా రాదని, ఫిర్యాదుపై సంతకం చేయించారని, భార్య మరణ వార్త విని తాను స్పృహ కోల్పోయానని వెల్లడించారు. ఈ ఘటనపై చర్యలు చేపట్టిన అధికారులు జిల్లా ఎస్పీని బదిలీ చేయగా, ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేతో సహా ఐదుగురిని వసూళ్లకు పాల్పడటం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. #DrArchanaSharma #Rajasthan #DoctorsProtest #MedicalJustice

0 0 310 0 0