Showcase Sainikpuri. 600 mtrs stretch.
You have an opportunity to make this one of the finest stretch in India.
- Symmetric sidewalks (large) on both sides.
- Entire stretch has a tree canopy.
- Tier 1 brands.
- Lovely crowd.
You have a readymade template.
Just implement. https://t.co/8xTkOTydCM
@Comm_HYDRAA-ప్రజారవాణాతోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
-రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లుండాలన్న హైడ్రా కమిషనర్
-కొన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసి చూపించాలంటూ సూచన
🔶చివరి మైలు వరకూ ప్రజారవాణా సమృద్ధిగా అందుబాటులో ఉంటే చాలా వరకు సొంత వాహనాల వినియోగం తగ్గిపోతుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. అలాగే ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్టీసీ సిటీ బస్సుల అనుసంధానం కూడా పెరగాలని సూచించారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు దిగిన వెంటనే గమ్యస్థానం చేరుకునేలా ఆర్టీసీ సిటీ బస్సులు, ఇతర ప్రజారవాణా వ్యవస్థలు అందుబాటులో ఉండాలన్నారు. రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లుంటే చాలా మంది ప్రజారవాణాను అందుకోడానికి సులభంగా నడుచుకుంటూ వెళ్తారని చెప్పారు. అప్పుడే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలను అధిగమించగలమన్నారు. సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత, ఆచరణాత్మక పరిష్కారాలు చూపడమే లక్ష్యంగా రాయదుర్గంలోని టీ హబ్‌లో `సైబరాబాద్ మూవ్స్ - 2026` పేరిట గురువారం ప్రారంభమైన సదస్సులో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు ఓ ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రజారవాణా అందుబాటులో ఉండడం, సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, రహదారులపై వర్షం నీరు నిలవకుండా ఏదో ఒక ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి చూపిస్తే.. ప్రజలలో నమ్మకం ఏర్పడడమే కాకుండా.. మనం చేసే కార్యక్రమాలకి వారి నుంచి పూర్తి మద్ధతు లభిస్తుందన్నారు. హైడ్రా చెరువులు, నాలాల పునరుద్ధరణే ఇందుకు ఉదాహరణ అని హైడ్రా కమిషనర్ పేర్కొన్నారు. చెరువుల చెంత ఆక్రమణలను తొలగించినప్పుడు కొంత మంది నిరసించినా.. తర్వాత అభివృద్ధిని చూసి అందరూ సహకరించడం ప్రారంభించారన్నారు. ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే ఫలితాలుంటాయన్నారు. ఇదే సమయంలో సిటీ ప్రణాళికలను కూడా సవరించాల్సినవసరం ఉందన్నారు. ఒకటి రెండు అంతస్తుల భవనాలున్నప్పుడు కాలనీల్లో, లే ఔట్లలో 10 శాతం భూమిని ప్రజావసరాలకోసం కేటాయించడం జరిగేదని.. ఇప్పుడు బహుళ అంతస్తులు వస్తున్నప్పుడు ఈ కేటాయింపులు సరిపోవని సూచించారు. మార్కెట్లకోసం ప్రత్యేకంగా స్థలాలను చూపిస్తే.. చాలా వరకు రహదారులు, ఫుట్‌పాత్‌లపైన చిరు వ్యాపారాలు సాగవన్నారు. ఇలా అన్ని సౌకర్యాలు సరిగా ఉండేలా కొన్ని ప్రాంతాలనైనా అబివృద్ధి చేసి చూపించాలన్నారు. సైబరాబాద్ జాయింట్ సీపీ సుప్రీత్‌సింగ్ గారు, సర్వేజన ఫౌండేషన్ సీఈవో, ఐఏఎస్ రిటైర్డ్ అధికారి డా. బి. జనార్దన్‌రెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ శ్రీధర్ గారితో పాటు పలువురు ఈ ప్యానల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు.
#HYDRAA #AVRanganath #CyberabadMoves2026
